సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 16:22:24

ఇప్పుడు జమ్ముకశ్మీర్‌, లడఖ్‌లో ఎవరైనా భూమి కొనొచ్చు : కేంద్రం నోటిఫికేషన్‌

ఇప్పుడు జమ్ముకశ్మీర్‌, లడఖ్‌లో ఎవరైనా భూమి కొనొచ్చు : కేంద్రం నోటిఫికేషన్‌

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్, లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పుడు ఎవరైనా భూమి కొనుగోలు చేయవచ్చు. ఇందుకు మార్గం సుగమం చేస్తూ భూ చట్టాలను కేంద్రం నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం భారతదేశానికి చెందిన ఏ పౌరుడైనా జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేయవచ్చు. ఈ ఉత్తర్వును జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ మూడవ ఉత్తర్వు, 2020 అని పిలుస్తారని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. ఈ ఉత్తర్వు తక్షణమే అమల్లోకి వస్తుందని, జనరల్ క్లాజ్ యాక్ట్, 1897 ఆర్డకు వర్తిస్తుందని కేంద్రం స్పష్టంచేసింది. 

ప్రభుత్వ ఉత్తర్వుపై స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. "జమ్ముకశ్మీర్‌ ఇప్పుడు అమ్మకానికి ఉంది" అని ట్వీట్టర్‌లో వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుతో పేద చిన్న భూ యజమానులు బాధపడటం ఖాయం అని అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 ను రద్దు చేయడంతో ఈ చట్టం పూర్వ జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని 'జమ్ముకశ్మీర్' , 'లడఖ్' అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతకుముందు 2020 సెప్టెంబర్‌లో జమ్ముకశ్మీర్ పరిపాలన, 2020 గ్రాంట్ ఆఫ్ డొమిసిల్ సర్టిఫికేట్ (ప్రొసీజర్) నిబంధనలను సవరించింది.

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.