శుక్రవారం 05 మార్చి 2021
National - Jan 15, 2021 , 16:38:03

టీకా ఎవ‌రు తీసుకోవాలి.. ఎవ‌రు తీసుకోవ‌ద్దు.. ఇవే వ్యాక్సినేష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాలు

టీకా ఎవ‌రు తీసుకోవాలి.. ఎవ‌రు తీసుకోవ‌ద్దు.. ఇవే వ్యాక్సినేష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాలు

న్యూఢిల్లీ: శ‌నివారం నుంచి దేశ‌వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే. అయితే టీకా ఎవ‌రెవ‌రు తీసుకుంటారు, ఎవ‌రు తీసుకోరు అన్న అంశాల‌ను ఓసారి పరిశీలిద్దాం. దీని కోసం కేంద్ర ఆరోగ్య‌శాఖ కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేసింది. వీడియో లింక్ ద్వారా ప్ర‌ధాని మోదీ .. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తారు.   తొలి ద‌శ‌లో ప్ర‌భుత్వం మూడు కోట్ల మంది హెల్త్ వ‌ర్క‌ర్లు, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు టీకా ఇవ్వ‌నున్నారు. 

ఇవే మార్గ‌ద‌ర్శ‌కాలు..

1. కోవిడ్ టీకా కేవ‌లం 18 ఏళ్ల వ‌య‌సు దాటిన‌వారికి మాత్ర‌మే.. 

2. 14 రోజుల తేడాతో రెండు డోసుల టీకాలు ఇవ్వ‌డం జ‌రుగుతుంది..

3. తొలి డోసు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో.. రెండ‌వ డోసు కూడా అదే టీకా అయి ఉండాలి.. 

4. వ్యాక్సిన్ల‌ను మార్చ‌డం కుద‌ర‌దు..

ఎవ‌రికి ఇవ్వొద్దంటే.. 

1. అల‌ర్జీ.. అన‌ఫైలాటిక్ రియాక్ష‌న్లు ఉన్న‌వారు కోవిడ్‌19 టీకా తీసుకోవ‌ద్దు. ఇంజ‌క్ష‌న్ల‌తో అల‌ర్జీ వ‌చ్చేవారిని కూడా దూరం పెట్టాలి..

2.  గ‌ర్భిణులు, బాలింతలు టీకా తీసుకోవ‌ద్దు. ఎందుకంటే, ఇప్ప‌టి వ‌ర‌కు  గ‌ర్బిణుల‌పై టీకా ట్ర‌య‌ల్స్ చేప‌ట్ట‌లేదు.  అందుకే వారు వ్యాక్సిన్ తీసుకోవ‌ద్దు.  పాలు ఇచ్చే త‌ల్ల‌లు కూడా టీకాకు దూరంగా ఉండ‌డం బెట‌ర్‌.  

3. సార్స్ సీవోవీ2 ఇన్‌ఫెక్ష‌న్ అధికంగా ఉన్న‌వారికి కోలుకున్న త‌ర్వాత కొన్ని వారాల‌కు టీకా ఇవ్వాలి.. 

4. ప్లాస్మా థెర‌పీ తీసుకున్న‌వారికి కూడా కొన్ని వారాల విరామం త‌ర్వాత టీకా ఇవ్వాలి. 

5. తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వారికి కూడా త‌క్ష‌ణ‌మే టీకా ఇవ్వ‌కూడ‌దు.. 

VIDEOS

logo