శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 01:31:26

ఛార్జీల నిర్ణయం ప్రైవేటుకే!

ఛార్జీల నిర్ణయం ప్రైవేటుకే!

  • ప్రైవేటు రైళ్లకు సంబంధించి రైల్వేశాఖ కీలక వెల్లడి
  • ప్రయాణికులపై త్వరలో యూజర్‌ ఛార్జీలు 
  • 10-15 శాతం రైల్వే స్టేషన్లలో వర్తింపు 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ప్రైవేటు రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతున్న రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆయా రూట్లలో నడిచే రైళ్లలో ప్రయాణ ఛార్జీలను నిర్ణయించే అధికారం ప్రైవేటు కంపెనీలకే ఇచ్చింది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ గురువారం వివరాలు వెల్లడించారు. ‘ప్రైవేటు రైళ్లలో టికెట్‌ రుసుమును నిర్ణయించే స్వేచ్ఛను ప్రైవేటు కంపెనీలకు ఇస్తున్నాం. అయితే, అదే రూట్లలో ప్రయాణిస్తున్న ఎయిర్‌ కండీషన్డ్‌ బస్సులు, విమానాల్లో వసూలు చేస్తున్న ఛార్జీలను దృష్టిలో ఉంచుకొని ఈ రుసుమును నిర్ణయించాలి’ అని పేర్కొన్నారు. మరోవైపు, రైలు ప్రయాణికులపై యూజర్‌ ఛార్జీలు విధిస్తామని, టికెట్‌ రుసుములో భాగంగానే ఇది ఉంటుందని వీకే యాదవ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఏడువేల రైలుస్టేషన్లలో బాగా రద్దీగా ఉన్న 10-15 శాతం స్టేషన్లలో మాత్రమే ఈ ఛార్జీలను వసూలు చేస్తామని చెప్పారు. ఆయా రైల్వేస్టేషన్ల అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాల కల్పన కోసమే వీటిని వసూలు చేయనున్నామన్నారు.


logo