గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 15:17:37

కరోనా కట్టడికి కేంద్రం వాట్సాప్‌ హెల్ప్‌ డెస్క్‌

కరోనా కట్టడికి కేంద్రం వాట్సాప్‌ హెల్ప్‌ డెస్క్‌

కరోనా మహమ్మారి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిపై దేశ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం కోసం తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక వాట్సాప్‌ హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసింది.  ‘MyGov Corona help desk’ పేరుతో ఏర్పాటైన ఈ వాట్సాప్‌ హెల్ప్‌డెస్క్‌ ద్వారా ప్రజలు కోవిడ్‌-19 వైరస్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా తెలుసుకోవచ్చు. ప్రస్తుత వాట్సాప్‌ యూజర్లు అందరికీ ఈ హెల్ప్‌ డెస్క్‌ అందుబాటులో ఉండనుంది.  

ఈ హెల్ప్‌ డెస్క్‌ సేవలు వినియోగించుకోవాలనుకునే వారు 9013151515 నెంబర్‌ను తమ ఫోన్లలో కాంటాక్ట్స్‌ లిస్టులో ఫీడ్‌ చేసుకుని, దాన్నుంచి ‘MyGov Corona help desk’కు మెసేజ్‌ పంపించాలి. కరోనా వైరస్‌కు సంబంధించి తప్పుడు వార్తలు ప్రచురితమైనప్పుడు, అబద్ధపు పుకార్లు ప్రచారమైనప్పుడు ప్రజలు నిజానిజాలు తెలుసుకోవడానికి ఈ హెల్ప్‌ డెస్క్‌ ఉపయోగపడనుంది. అంతేగాక వైరస్‌ విస్తరణపై ప్రజలను అలర్ట్‌ చేయడంలో, ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను తెలియజేయడంలో కూడా ఈ డెస్క్‌ కీలకపాత్ర పోషించనుంది.       


logo