బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 13:43:23

ఎంఐబీ ప‌రిధిలోకి డిజిట‌ల్ మీడియా కంటెంట్‌.. ఉత్త‌ర్వులు జారీ

ఎంఐబీ ప‌రిధిలోకి డిజిట‌ల్ మీడియా కంటెంట్‌.. ఉత్త‌ర్వులు జారీ

ఢిల్లీ : ఆన్‌లైన్ ఫిల్మ్‌లు, ఆడియో-విజువల్ ప్రోగ్రామ్‌లు, ఆన్‌లైన్ న్యూస్ & కరెంట్ అఫైర్స్ కంటెంట్‌ను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ(ఎంఐబీ) పరిధిలోకి తీసుకువ‌స్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్‌లతో సహా ఓటీటీ (ఓవర్-ది-టాప్) ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇప్పుడు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోకి వ‌స్తాయ‌ని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్‌ను వెల్ల‌డించింది. ప్రస్తుతం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రింట్ మీడియా వ్య‌వ‌హారాల‌ను చూస్తుండ‌గా, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) న్యూస్ ఛానెళ్లను చూసుకుంటుంది, యాడ్స్ కోసం అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సినిమాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) పర్యవేక్షిస్తుంది. కాగా డిజిటల్ కంటెంట్‌ను నియంత్రించే చట్టం లేదా స్వయంప్రతిప‌త్తి గ‌ల సంస్థ ఏదీ లేదు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం డిజిట‌ల్ మీడియా కంటెంట్‌ను ఎంఐబీ ప‌రిధిలోకి తీసుకువ‌స్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.