మంగళవారం 11 ఆగస్టు 2020
National - Aug 03, 2020 , 01:42:55

14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి

14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి

  • విదేశాలనుంచి వచ్చేవారికి కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: విదేశాలనుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా పాటించాల్సిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం విడుదలచేసింది. ప్రతిప్రయాణికుడు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. కొత్త మార్గదర్శకాలు 8 నుంచి అమల్లోకి వస్తాయి. 

మార్గదర్శకాలు

  • ప్రయాణికులు మొదటి ఏడురోజుల సొంతఖర్చులతో ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌, తర్వాతి ఏడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి.
  • విదేశాలనుంచి వచ్చే ప్రతివ్యక్తి క్వారంటైన్‌లో ఉండటానికి సమ్మతిస్తూ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి. ప్రత్యేక సందర్భాల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి. గర్భిణులు, కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండవల్సిన అవసరం లేదు. 
  • ఈ సౌకర్యాలు పొందాలంటే ప్రయాణానికి 72గంటల ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినవారు సంబంధిత ఆధారాలు చూపినా కూడా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇస్తారు.  

స్మార్ట్‌ ఫోన్లను అనుమతించండి!

కరోనా రోగులు తమ కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడటానికి స్మార్ట్‌ ఫోన్లను అనుమతించాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. ఈ మేరకు డీజీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రాజీవ్‌ గార్గ్‌ గత నెల 29న రాష్ర్టాలకు లేఖ రాశారు. 


logo