శనివారం 28 నవంబర్ 2020
National - Oct 29, 2020 , 07:01:11

న‌గ‌రంలో డ‌బుల్ డెక్క‌ర్ ఫ్లైఓవ‌ర్‌

న‌గ‌రంలో డ‌బుల్ డెక్క‌ర్ ఫ్లైఓవ‌ర్‌

చెన్నై: త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోని ఓడ‌రేవును న‌గ‌రంలోని ఇత‌ర ముఖ్య‌మైన ప్ర‌దేశాల‌తో క‌లుపుతూ డ‌బుల్ డెక్క‌ర్ ఫ్లైఓవ‌ర్ నిర్మించాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనివ‌ల్ల న‌గ‌రంలో ట్రాఫిక్ ర‌ద్దీని చాల‌వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ అన్నారు. దీని నిర్మాణానికి రూ.5 వేల కోట్లు వ్య‌యం అవుతుంద‌ని చెప్పారు. ఈ ప్ర‌తిపాదిత‌ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఆమోదం తెలిపితే చెన్నైలో ర‌వాణాకు సంబంధించి వ‌చ్చే 20-25 ఏండ్ల స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని వెల్ల‌డించారు. 

బెంగ‌ళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే ప‌నులు కూడా త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌వుతాయ‌ని తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి సంబంధించి ఇప్ప‌టికే భూసేక‌ర‌ణ పూర్త‌య్యింద‌ని, క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల అది ఆల‌స్య‌మ‌వుతున్న‌ద‌ని చెప్పారు.