శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 12:02:15

జ‌నాభా లెక్క‌లు, ఎన్సీఆర్ వాయిదా !

జ‌నాభా లెక్క‌లు, ఎన్సీఆర్ వాయిదా !

హైద‌రాబాద్‌: జాతీయ పౌర ప‌ట్టిక కోసం చేప‌డుతున్న ప్ర‌క్రియ‌ను కేంద్రం నిలిపివేయాల‌నుకున్న‌ట్లు తెలుస్తోంది.  కోవిడ్‌19 వ్యాధి విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో.. కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య‌శాఖ సూచ‌న‌ల మేర‌కు ఎన్‌పీఆర్ ప్ర‌క్రియ‌ను నిలిపివేయాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  జ‌నాభా లెక్క‌లు, ఎన్‌పీఆర్ చేప‌ట్టే ప్ర‌క్రియ‌ను ఆపేస్తున్న‌ట్లు కొన్ని ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందింది. భారీ స‌మూహాల‌కు దూరంగా ఉండాల‌ని ఆరోగ్య‌శాఖ సూచ‌న‌లు చేసిన నేప‌థ్యంలో ఎన్‌పీఆర్ డేటా సేక‌ర‌ణ‌ను ఆపేయాల‌ని భావిస్తున్నారు. క‌నీసం ఒకనెల రోజుల‌న్నా సెన్సెస్‌-ఎన్‌పీఆర్‌ను వాయిదా వేయాల‌ని ఒడిశా, ఢిల్లీ ప్ర‌భుత్వాలు కేంద్రాన్ని కోరాయి.  

ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎపిడ‌మిక్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిందని, అలాంటి స‌మ‌యంలో ఇంటి ఇంటికి వెళ్లి జ‌నాభా లెక్క‌ల సేక‌ర‌ణ చేప‌ట్ట‌డం సాధ్యం కాదు అని సెన్సెస్ క‌మిష‌న‌ర్ ఆఫ్ ఇండియా వివేక్‌ జోషి తెలిపారు. ఇంత‌కుముందు ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా కేంద్రానికి లేఖ రాశారు. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలో ఎన్పీఆర్‌ను ర‌ద్దు చేయాల‌ని సీఎం ప‌ట్నాయ‌క్ కేంద్రాన్ని కోరారు.  ఢిల్లీతో పాటు 60 శాతం దేశ జ‌నాభా ఉన్న 13 రాష్ట్రాలు ఎన్‌పీఆర్‌ను వ్య‌తిరేకిస్తున్నాయి.  ఎన్‌పీఆర్ కోసం త‌యారు చేసిన ఫార్మాట్ స‌రిగాలేద‌ని ఆ రాష్ట్రాలు పేర్కొంటున్నాయి. ఎన్‌పీఆర్‌, ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా కొన్ని రాష్ట్రాలు ఇప్ప‌టికే తీర్మానాలు చేశాయి.  


logo