శనివారం 31 అక్టోబర్ 2020
National - Jul 08, 2020 , 21:11:01

40 శాతం నిధులిచ్చి వందశాతం క్రెడిట్‌ కొట్టేస్తున్న కేంద్రం: మమతా బెనర్జీ

40 శాతం నిధులిచ్చి వందశాతం క్రెడిట్‌ కొట్టేస్తున్న కేంద్రం: మమతా బెనర్జీ

కోల్‌కతా: ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేవలం 40 శాతంమాత్రమే నిధులు ఇస్తూ.. వందశాతం క్రెడిట్‌ కొట్టేస్తున్నదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు.  రాష్ట్ర సర్కారు స్వాస్థ్య సాథీ కింద వందశాతం నిధులు ఖర్చు చేస్తున్నదని ఓ కార్యక్రమంలో ఆమె స్పష్టం చేశారు. తన ప్రభుత్వం ప్రజలను పట్టించుకుంటుంది కాబట్టి వలస కార్మికులు పశ్చిమ బెంగాల్‌ను విడిచిపెట్టలేదని పేర్కొన్నారు. 

ఏడాది మొత్తం ఉచితంగా రేషన్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం తమదేనని ఆమె తెలిపారు. ‘బీజేపీ సౌత్ కోల్‌కతా అధ్యక్షుడితోపాటు అతడి తల్లికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడు ఆ పార్టీ నాయకులను సహాయం చేయమని అడిగితే ఎవరూ ముందుకురాలేదు. నేను చొరవ తీసుకొని వారిని దవాఖానలో చేర్పించా.’ అని మమతా బెనర్జీ వెల్లడించారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. అవసరమైతే తప్ప ఇతర ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించారు. రాష్ట్రంలో అవినీతి 90 శాతం తగ్గిందని, మిగతా పదిశాతం తగ్గించేందుకు కృషిచేస్తానన్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.