ఓ వీధిని మినీ పార్కుగా తీర్చిదిద్దిన బుడతలు
చిన్నకోడూరు, ఏప్రిల్ 12: చిన్నారుల్లో హరితచైతన్యం వెల్లివిరిసింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ బీసీ కాలనీలోని ఓ వీధిని మినీ పార్కుగా తీర్చిదిద్దారు. హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకునే కంకట యుక్త, కంకట వేదాంత అనే ఇద్దరు చిన్నారులు ఆన్లైన్ క్లాసుల కారణంగా తమ సొంత గ్రామమైన చంద్లాపూర్కు వచ్చారు. కుటుంబ సభ్యుల సహకారంతో వారు తమ వీధిలోని మొక్కలకు రంగులద్ది కలర్ఫుల్గా తీర్చిదిద్దారు. చెట్లను అందంగా మలిచి ఒక మినీ పార్కు అనుభూతి వచ్చేలా మలిచి అందరిచే ప్రశంసలందుకుంటున్నారు.