గురువారం 09 జూలై 2020
National - Jun 29, 2020 , 10:41:53

చైనా కంపెనీల టెండ‌ర్లు.. 2900 కోట్ల ప్రాజెక్టు ర‌ద్దు

చైనా కంపెనీల టెండ‌ర్లు.. 2900 కోట్ల ప్రాజెక్టు ర‌ద్దు

హైద‌రాబాద్‌:  బీహార్‌లోని గంగా న‌దిపై సుమారు 2900 కోట్లతో నిర్మించ ‌త‌ల‌పెట్టిన బ్రిడ్జ్ ప‌నులను వాయిదా వేశారు.  ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం వేసిన బిడ్డింగ్‌లను.. రెండు చైనా కంపెనీలు ద‌క్కించుకున్నాయి.  అయితే ప్ర‌స్తుతం ఆ దేశంతో వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొన్న నేప‌థ్యంలో..  ప్రాజెక్టును ర‌ద్దు చేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం న‌లుగురు కాంట్రాక్ట‌ర్లు సెల‌క్ట్ అయ్యార‌ని, దాంట్లో రెండు చైనా కంపెనీలు ఉన్న‌ట్లు ఓ అధికారి తెలిపారు. అందుకే ఆ టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసి మ‌ళ్లీ త్వ‌ర‌లో టెండ‌ర్ల‌కు ఆహ్వానం ప‌లుకనున్న‌ట్లు ఆ అధికారి చెప్పారు.  

బ్రిడ్జ్ ప్రాజెక్టులో భాగంగా బీహార్‌లో సుమారు 5.6 కిలోమీట‌ర్ల పొడువైన వంతెన‌ను గంగా న‌దిపై నిర్మించ‌నున్నారు.  మ‌రికొన్ని మైన‌ర్ బ్రిడ్జ్‌లు, అండ‌ర్‌పాస్‌లు, రైల్ ఓవ‌ర్ బ్రిడ్జ్‌లు కూడా నిర్మించ‌నున్నారు. ఈనెల 15వ తేదీన గాల్వ‌న్ లోయ‌లో చైనా సైనికుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు చ‌నిపోయారు. ఈ నేప‌థ్యంలో బీహార్ బ్రిడ్జ్ ప్రాజెక్టును ర‌ద్దు చేశారు. 

గ‌త ఏడాది డిసెంబ‌ర్ 16వ తేదీన ఈ ప్రాజెక్ట‌కు కేంద్ర క్యాబినెట్ నుంచి క్లియ‌రెన్స్ ల‌భించింది. ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో జ‌రిగిన భేటీలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. గంగా న‌దిపై నిర్మించ‌నున్న బ్రిడ్జ్ వ‌ల్ల పాట్నా, స‌ర‌న్‌, వైశాలి జిల్లాల ప్ర‌జ‌ల‌కు లాభం చేకూర‌నున్న‌ది.  


logo