సోమవారం 25 జనవరి 2021
National - Dec 19, 2020 , 23:04:25

చర్చలతోనే రైతు ఆందోళనకు పరిష్కారం

చర్చలతోనే రైతు ఆందోళనకు పరిష్కారం

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలపై రైతులు చేపట్టిన ఆందోళనకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సమావేశమయ్యారు. రైతుల ఆందోళనకు పరిష్కార మార్గాలపై నరేంద్ర సింగ్‌ తోమర్‌తో ఖట్టర్‌ సుదీర్ఘంగా చర్చించారని అధికార వర్గాలు తెలిపాయి. తోమర్‌తో భేటీ తర్వాత హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మాట్లాడుతూ రైతుల ఆందోళనను సత్వరం పరిష్కరించాలని సూచించినట్లు చెప్పారు.

‘వచ్చే 2-3 రోజుల్లో చర్చలు జరుగుతాయని నమ్ముతున్నా. చర్చల ద్వారానే రైతుల ఆందోళనలకు పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యను త్వరితంగా పరిష్కరించాలని మంత్రి తోమర్‌ను కోరాను’ అని మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. 

హర్యానాలోని రోహ్​తక్​ రైతులకు మద్దతుగా నిరసనల్లో కేంద్ర మాజీ మంత్రి చౌధరి బీరేంద్ర సింగ్​.. పాల్గొన్న మరునాడే నరేంద్ర సింగ్‌ తోమర్‌తో ఖట్టర్‌ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. రైతులు నిరసనలు చేపట్టిన తర్వాత కేంద్ర వ్యవసాయ మంత్రితో ఖట్టర్​​ భేటీ కావటం ఇది రెండోసారి. ఇంతకు ముందు ఈనెల​ 8వ తేదీన సమావేశమయ్యారు.మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo