బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 14, 2020 , 15:37:20

త‌మిళ‌నాడు సీఎస్ ప‌ద‌వీకాలం మ‌రోసారి పొడిగింపు

త‌మిళ‌నాడు సీఎస్ ప‌ద‌వీకాలం మ‌రోసారి పొడిగింపు

న్యూఢిల్లీ: త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కే ష‌ణ్ముగం ప‌ద‌వీకాలాన్ని మ‌రో మూడు నెల‌లు పొడిగించారు. చీఫ్ సెక్రెట‌రీ ప‌ద‌వీకాలాన్ని మ‌రోసారి పొడిగించాలంటూ ఇటీవ‌ల త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం పంపిన అభ్య‌ర్థ‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఈ విష‌యాన్ని కేంద్రంలోని ప‌ర్స‌న‌ల్, ప‌బ్లిక్ గ్రీవియ‌న్సెస్ అండ్ పెన్ష‌న్స్ శాఖ వెల్ల‌డించింది. దీంతో ష‌ణ్ముగం 2021, జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు త‌మిళ‌నాడు చీఫ్ సెక్రెట‌రీగా కొన‌సాగ‌నున్నారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్రభావం ఇంకా కొన‌సాగుతుండ‌టంతో మ‌రో మూడు నెల‌ల‌పాటు ష‌ణ్ముగంనే సీఎస్‌గా కొన‌సాగించాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కోరింది. 

కాగా, ష‌ణ్ముగం ప‌ద‌వీకాలాన్ని గతంలో కూడా ఒక‌సారి పొడిగించారు. 2019 జూలై 1న త‌మిళ‌నాడు సీఎస్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ష‌ణ్ముగం 2020, జూలై 31న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి ఉన్న‌ది. అయితే క‌రోనా పరిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని మ‌రో మూడు నెల‌ల‌పాటు పొడిగించాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి చేయ‌డంతో కేంద్రం అందుకు అంగీక‌రించింది. ఆ మేర‌కు అక్టోబ‌ర్ 31న ఆయ‌న ప‌ద‌వీకాలం ముగియాల్సి ఉండ‌గా.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తి మేర‌కు మ‌రో మూడు నెలలు పొడిగించారు. అంటే 2021, జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు ఆయ‌న త‌మిళ‌నాడు సీఎస్‌గా కొన‌సాగుతారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.