సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 17:27:02

ప‌శ్చిమ బెంగాల్ విజ్ఞ‌ప్తికి కేంద్రం సానుకూలం

ప‌శ్చిమ బెంగాల్ విజ్ఞ‌ప్తికి కేంద్రం సానుకూలం

కోల్‌క‌తా : బై వీక్లీ లాక్‌డౌన్ స‌మ‌యంలో కోల్‌క‌తా ఎయిర్‌పోర్టుకు విమాన రాక‌పోక‌ల‌ను నిలిపివేయాల్సిందిగా ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తికి కేంద్ర పౌర విమానాయాన మంత్రిత్వ‌శాఖ సానుకూలంగా స్పందించింది. లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని జులై 25న‌(శ‌నివారం), జులై 29(బుధ‌వారం) నాడు కోల్‌క‌తాకు వ‌చ్చే విమానాల‌ను, కోల్‌క‌తా నుంచి వెళ్లే విమానాల‌ను ర‌ద్దు చేసింది. 

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో జులై 31 వ‌ర‌కు వారానికి రెండు రోజుల పాటు ప‌శ్చిమ‌బెంగాల్ వ్యాప్తంగా మ‌మ‌తా స‌ర్కార్ లాక్‌డౌన్‌ను విధించింది. కంటైన్మెంట్ జోన్ల‌లో పాటిస్తున్న లాక్‌డౌన్‌కు ఇది అద‌నం. రాష్ర్టంలో ప్ర‌స్తుతం 962 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అలపాన్ బందోపాధ్యాయ్ స్పందిస్తూ... వైర‌స్ వ్యాప్తి గొలుసును బ్రేక్ చేసే నిమిత్తం వారానికి రెండు రోజుల పాటు రాష్ర్ట ప్ర‌భుత్వం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు.


logo