సోమవారం 01 జూన్ 2020
National - May 09, 2020 , 22:19:20

పది రాష్ర్టాలకు కేంద్ర బృందాలు

పది రాష్ర్టాలకు కేంద్ర బృందాలు

హైదరాబాద్‌: కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న పది రాష్ర్టాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బృందాలు సహకరించనున్నాయి. ఈ బృందంలో కేంద్ర వైద్యశాఖకు సంబంధించిన పబ్లిక్‌ హెల్త్‌ నిపుణుడు సభ్యునిగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు గుజరాత్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ రాష్ర్టాల్లో ఈ బృందాలు పర్యటిస్తాయి. ఇప్పటికే 20 రాష్ర్టాలకు పంపిన బృందాలకు ఇవి అదనం.


logo