శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 13:57:45

టికెట్ల తనిఖీ కోసం సెంట్రల్ రైల్వే కొత్త యాప్

టికెట్ల తనిఖీ కోసం సెంట్రల్ రైల్వే కొత్త యాప్

ముంబై: కరోనా నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల టికెట్ల తనిఖీకి సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ ఒక యాప్‌ను ప్రవేశపెట్టింది. ‘చెక్ఇన్ మాస్టర్’ పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా రైల్వే టీసీలు ప్రయాణికుల వద్ద ఉన్న టికెట్లను ముట్టుకోకుండా తమ మొబైల్స్‌లోని ఈ యాప్ ద్వారా వాటిని తనిఖీ చేస్తున్నారు. రైల్వే టికెట్లపై ముద్రించే బార్ కోడ్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వాటిని తనిఖీ చేస్తున్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్టేషన్‌లో ఈ విధానాన్ని పాటిస్తున్నారు. టికెట్లు తనిఖీ చేసే రైల్వే సిబ్బందికి కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ఈ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ ప్రజా సంబంధాల విభాగం తెలిపింది.
logo