బుధవారం 08 జూలై 2020
National - Jun 20, 2020 , 17:13:27

ఆమె సాహ‌సాన్ని ప్ర‌శంసించిన‌ సెంట్ర‌ల్ రైల్వే!

ఆమె సాహ‌సాన్ని ప్ర‌శంసించిన‌ సెంట్ర‌ల్ రైల్వే!

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ముంబైలో స్థానిక రైలును న‌డుపుతున్న మోటార్ ఉమెన్‌ను సెంట్ర‌ల్ రైల్వే ప్ర‌శంసించింది. మ‌హారాష్ట్రకు చెందిన మ‌నీషా మాస్కే ఘోర్పాడే ముఖానికి మాస్క్ ధ‌రించి క‌రోనా సోక‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ రైలు న‌డుపుతున్న‌ది. ‌మాస్క్ ధ‌రించి రైలు న‌డుపుతున్న ఆమె ఫొటోను రైల్వే శాఖ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

మనీషా మాస్కే ఘోర్పాడే మహారాష్ట్ర రాజధానిలోని నౌకాశ్రయ మార్గంలో సిఎస్‌ఎమ్‌టి-పన్వెల్ లోకల్ రైలును నడిపారు. ఇందులో ఆమెను ప్ర‌సంశించ‌డంతోపాటు స్థానిక రైళ్లలో ప్రయాణించేటప్పుడు భద్రతా జాగ్రత్తలు పాటించాలని సెంట్రల్ రైల్వే ప్రయాణికులను కోరారు. స్థానిక రైలులో ప్రయాణించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సురక్షితంగా ఉండండి అనే శీర్షిక‌తో షేర్ చేశారు. పోస్ట్ చూసిన వారంతా మ‌నీషా మాస్కే ఘోర్పాడేకు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. 

 


logo