శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 04, 2020 , 12:38:42

డ‌జ‌న్ల కొద్ది జ‌ర్న‌లిస్టుల‌ను అరెస్టు చేసిన‌ప్పుడు ఏమ‌య్యారు?

డ‌జ‌న్ల కొద్ది జ‌ర్న‌లిస్టుల‌ను అరెస్టు చేసిన‌ప్పుడు ఏమ‌య్యారు?

ఢిల్లీ : రిప‌బ్లిక్ టీవీ సీఈవో అర్న‌బ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో పోలీసులు గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు.కేంద్ర స‌మాచారం, ప్ర‌సార‌శాఖ మంత్రి ప్ర‌‌కాశ్ జ‌వ‌దేకర్‌తో పాలు ప‌లువురు కేంద్ర మంత్రులు అర్న‌బ్ అరెస్టును ఖండించారు. మ‌హారాష్ట్ర‌లో ప‌త్రికా స్వేచ్ఛ‌పై దాడి జ‌రిగిన‌ట్లుగా పేర్కొన్నారు. ప‌త్రికా రంగాన్ని చూడాల్సిన విధానం ఇది కాద‌న్నారు. ఎమ‌ర్జెన్సీ కాలంలో ప్రెస్‌ను ఇలాగే చూశార‌ని ఆరోపించారు. కేంద్ర మంత్రుల తీరుపై ప్ర‌ముఖ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. అర్నాబ్ ‌గోస్వామి అరెస్టుకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులు బయటకు వచ్చిన విధానం హత్తుకుంటుంద‌న్నారు. ముఖ్యంగా వారు దీనిని ఎమ‌ర్జెన్సీతో పోల్చుతున్నారు. బీజేపీ ప్రభుత్వాలు డజన్ల కొద్దీ జర్నలిస్టులను అరెస్టు చేసినప్పుడు ఏమైపోయింది ఈ స్పంద‌న అని ప్ర‌శ్నించారు. వారి ఎన్‌ఐఏ, సీబీఐ, ఈడీ పోలీసులు కార్యకర్తలను వేధించినప్పుడు, అరెస్టు చేసినప్పుడు ఎందుకు స్పందించ‌లేద‌న్నారు.