శుక్రవారం 05 జూన్ 2020
National - Nov 28, 2019 ,

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌

ఢిల్లీ: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ నేడు తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు సంతోష్‌కుమార్‌, కేశవరావు, బండా ప్రకాశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ జవదేకర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ హరితహారం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ర్టాన్ని హరిత తెలంగాణ చేశారన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా 4.5 కోట్లకు పైగా మొక్కలు నాటడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా పిలుపునిచ్చారు.
logo