గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 20:24:19

ఖాదీ సిల్కు మాస్కుల "గిఫ్ట్ బాక్సు" ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

 ఖాదీ సిల్కు మాస్కుల

ఢిల్లీ : ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి)  చేనేత ఉత్పత్తు లను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది.  ఈ "గిఫ్ట్ బాక్సు" ‌ను ఎం.ఎస్.‌ఎం.ఇ. శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ "గిఫ్టు బాక్సు" లో వివిధ రంగులు , ప్రింట్లలో చేతితో తయారు చేసిన నాలుగు సిల్కు మాస్కులు ఉంటాయి.  నల్లని రంగుపై పైకి ఉబ్బిన బంగారు అక్షరాలు ముద్రించి, అందంగా రూపొందించిన చేతితో తయారు చేసిన కాగితపు పెట్టెలో మాస్కులను ప్యాకింగ్ చేశారు. ఈ "గిఫ్టు బాక్సు" పండుగల సమయంలో అందరికీ పంచుకోవడానికి తగిన ఉత్పత్తి అని గడ్కరీ ప్రశంసించారు.  కరోనా మహమ్మారి అత్యంత కష్ట సమయంలో చేనేత కళాకారులకు జీవనోపాధి కల్పించిందని కె.వి.ఐ.సి. మాస్కు తయారీ కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. విదేశీ మార్కెట్ ‌ను ఆకర్షించాలనే ఆలోచనతో, ఈ "గిఫ్టు బాక్సు" ను ప్రారంభించడం జరిగిందని, కె.వి.ఐ.సి. చైర్మన్  వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు. ఈ పండుగ సీజన్లో తమ ప్రియమైనవారి కోసం సరసమైన ధరలో బహుమతుల కోసం వెతుకుతున్న భారతీయులకు ఇది అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. 


logo