మంగళవారం 07 జూలై 2020
National - Jun 28, 2020 , 13:26:50

రాహుల్‌గాంధీవి బుర్రత‌క్కువ రాజ‌కీయాలు: అమిత్‌షా

రాహుల్‌గాంధీవి బుర్రత‌క్కువ రాజ‌కీయాలు: అమిత్‌షా

న్యూఢిల్లీ: ‌కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, సీనియ‌ర్ నాయకుడు రాహుల్‌గాంధీపై బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాహుల్‌గాంధీవి బుర్ర‌త‌క్కువ రాజ‌కీయాల‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలోని అగ్ర‌నేత బుర్ర‌త‌క్కువ రాజ‌కీయాల్లో మునిగిపోవ‌డం బాధాక‌ర‌మ‌ని షా వ్యాఖ్యానించారు. ఆదివారం మ‌ధ్యాహ్నం ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ANIకి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఆయ‌న ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

సున్నిత అంశ‌మైన‌ గ‌ల్వాన్ ఘర్ష‌ణ‌ల విష‌యంలో ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ రాహుల్‌గాంధీ చేస్తున్న వ్యాఖ్య‌లు చైనా, పాకిస్థాన్ దేశాల‌ను స‌పోర్టు చేస్తున్న‌ట్లుగా ఉన్నాయ‌ని అమిత్‌షా విమ‌ర్శించారు. రాహుల్ భార‌త ప్ర‌భుత్వంపై చేసే విమ‌ర్శ‌లు చైనా, పాకిస్థాన్ దేశాల్లో వైర‌ల్ అవుతున్నాయ‌ని, రాహుల్ తెలివిత‌క్కువ త‌నానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 1962 నాటి భార‌త్‌-చైనా యుద్ధం మొద‌లు, ఇప్ప‌టి గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ల వ‌ర‌కు ఏ అంశంపై అయినా పార్ల‌మెంటులో చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని షా స్ప‌ష్టంచేశారు.   ‌ 


logo