శనివారం 28 మార్చి 2020
National - Mar 25, 2020 , 15:22:35

ఇళ్లు ఖాళీ చేయిస్తే క‌ఠిన చ‌ర్య‌లు: కేంద్రం

ఇళ్లు ఖాళీ చేయిస్తే క‌ఠిన చ‌ర్య‌లు: కేంద్రం

మ‌హమ్మారి క‌రోనా బాధితుల‌కు  వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందిపై అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తిస్తున్న ఇంటి యాజ‌మానుల‌పై కేంద్రం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పలురాష్ట్రాల్లో ఇదే ప‌రిస్థితి ఉండ‌గా అలాంటి ఇంటి యాజ‌మానుల‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీచేసింది. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి..క‌రోనా బాధితుల‌కు చికిత్స అందిస్తుంటే వారిని ఇల్లు ఖాళీ చేయించ‌డ‌మేంట‌ని మండిప‌డ్డింది. ఢిల్లీలో చాలా మంది ఓన‌ర్లు వై ద్యులు, న‌ర్సులు, ఇత‌ర సిబ్బందిని ఇల్లు ఖాళీ చేయిస్తున్నార‌ని ఎయిమ్స్ డాక్ట‌ర్లు కేంద్ర‌హోంశాఖ‌కు లేఖ రాయ‌గా కేంద్రం వెంట‌నే స్పందించింది. అలాంటి వారిపై కేసులు న‌మోదు చేస్తామ‌ని తెలిపింది. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ ఎదుర‌యితే త‌మ దృష్టికి తీసుకురావాల‌ని అధికారులు సూచించారు. logo