శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 13:33:50

దోపిడీ కేసులో కేంద్రప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌

దోపిడీ కేసులో కేంద్రప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌

ముంబై:  మద్యం షాపు యజమాని నుంచి ప్రతీ నెలా రూ.7 లక్షలు దోపిడీ చేసేందుకు యత్నించిన కేంద్రప్రభుత్వ ఉద్యోగిని ముంబై మెరైన్‌ డ్రైవ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖలో కార్మికుడిగా పనిచేస్తున్న  రాజేంద్రవాగ్‌మరే అనే ఉద్యోగి దక్షిణ ముంబైలో మద్యం షాపు నిర్వహిస్తున్న అశోక్‌ పటేల్‌ దగ్గరకు వచ్చాడు. మద్యం షాపు లైసెన్స్‌ నిబంధనల ప్రకారం లేదని, అందుకు తాను ప్రతీ నెలా రూ.7లక్షలు విలువ చేసే సరుకు అమ్ముకుంటానని అశోక్‌ పటేల్‌ను బెదిరించాడు. దీంతో అశోక్‌ పటేల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజేంద్రవాగ్‌మరేపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. logo