ఆదివారం 29 మార్చి 2020
National - Feb 19, 2020 , 12:41:32

కేంద్ర ప్ర‌భుత్వ ఒత్తిళ్ల వ‌ల్లే ఎంపీలు చ‌నిపోతున్నారు : మ‌మ‌తా బెన‌ర్జీ

కేంద్ర ప్ర‌భుత్వ ఒత్తిళ్ల వ‌ల్లే ఎంపీలు చ‌నిపోతున్నారు : మ‌మ‌తా బెన‌ర్జీ

హైద‌రాబాద్‌:  కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న ఒత్తిళ్ల వ‌ల్ల‌నే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న‌ట్లు బెంగాల్ సీఎం మ‌మతా బెన‌ర్జీ ఆరోపించారు.  కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల తీవ్ర వ‌త్తిళ్ల వ‌ల్ల‌నే ఇటీవ‌ల ముగ్గురు నేత‌లు మ‌ర‌ణించిన‌ట్లు ఆమె అన్నారు.  బెంగాల్ న‌టుడు, మాజీ ఎంపీ త‌పాస్ పాల్‌.. మంగ‌ళ‌వారం ముంబైలో గుండెపోటుతో మృతిచెందిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న మ‌ర‌ణ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. కేంద్ర ప్ర‌భుత్వ విధానాల వ‌ల్ల త‌పాస్  పాల్ లాంటి వాళ్లు చ‌నిపోయిన‌ట్లు మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు.  కొంద‌రు నేత‌ల‌ను జైళ్ల‌లో వేస్తున్నార‌ని, కానీ ద‌ర్యాప్తు సంస్థలు మాత్రం వాళ్లు చేసిన నేరాన్ని రుజువు చేయ‌లేక‌పోతున్నాయ‌ని సీఎం అన్నారు.  ఒక‌వేళ ఎవ‌రైనా నేరం చేస్తే, అప్పుడు వాళ్లు ఆ శిక్ష‌ను అనుభ‌వించాల‌ని, కానీ త‌పాస్ పాల్ లాంటి నేత‌లు ఎటువంటి నేరం చేశార‌న్న విష‌యం ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేద‌న్నారు.  

మాజీ ఎంపీ సుల్తాన్ అహ్మాద్‌, మ‌రో మాజీ ఎంపీ ప్ర‌సూన్ బెన‌ర్జీ భార్య కూడా ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వ ఒత్తిళ్ల వ‌ల్లే మ‌ర‌ణించిన‌ట్లు బెంగాల్ సీఎం ఆరోపించారు. మాజీ ఎంపీ త‌పాస్ పాల్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  రోజ్ వ్యాలీ గ్రూపు కుంభ‌కోణంలో పాత్ర ఉన్న‌ట్లు గ‌తంలో సీబీఐ ఆయ‌న్ను అరెస్టు చేసింది.  చిట్ ఫండ్ స్కామ్ విలువ సుమారు 20 వేల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు. 2013లో బెంగాల్‌లో ఈ స్కామ్ బ‌య‌ట‌ప‌డింది. అయితే రోజ్ వ్యాలీ సంస్థ త‌మ ర‌హ‌స్య కార్య‌క‌లాపాల‌ను దాచిపెట్టేందుకు.. కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆ డ‌బ్బుతో ఎర‌వేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 


logo