శుక్రవారం 10 జూలై 2020
National - Jun 21, 2020 , 06:44:28

ఉచిత సిలిండర్ల నిర్ణయంలో మార్పు

ఉచిత సిలిండర్ల నిర్ణయంలో మార్పు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలపై ఆర్థిక భారం పడకుండా మూడు వంటగ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామని కేంద్రప్రభుత్వం ఏప్రిల్‌ మొదటివారంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులందరికీ ఇది వర్తిస్తుంది. అయితే ఆ నిర్ణయంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మూడు సిలిండర్లలో చివరి దానికి ప్రజలు ముందుగానే డబ్బులు చెల్లించాలని, తర్వాత ఆ డబ్బులు వారి ఖాతాల్లో జమవుతాయని పేర్కొన్నది. 

ఈ ప్రభావం దాదాపు 8 కోట్ల కుటుంబాలపై పడనుంది. కేంద్రం నిర్ణయం ప్రకారం 3 నెలల్లో 241 కోట్ల సిలిండర్లు పంపిణీ చేయాలి. కానీ ఇప్పటి వరకు 42 శాతం సిలిండర్ల పంపిణీ మాత్రమే జరిగింది. మూడో సిలిండర్‌కు డబ్బులు చెల్లించడానికి వచ్చే మార్చి 31 దాకా అవకాశం కల్పించారు.


logo