బుధవారం 03 జూన్ 2020
National - Mar 31, 2020 , 09:53:14

క‌రోనా ఎఫెక్ట్‌: లారీ డ్రైవ‌ర్ల‌కూ ఆరోగ్య బీమా

క‌రోనా ఎఫెక్ట్‌: లారీ డ్రైవ‌ర్ల‌కూ ఆరోగ్య బీమా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో నిత్యావసర సరకులను సరఫరా చేసే లారీల‌ డ్రైవర్లకు కేంద్ర ర‌వాణా మంత్రిత్వశాఖ శుభవార్త తెలిపింది. నిత్యావసర సరుకులను చేరవేసే లారీ డ్రైవర్లు, క్లీన‌ర్ల‌కు ఆరోగ్య బీమా కల్పించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన‌ట్లు పేర్కొన్న‌ది. అదేవిధంగా జాతీయ రహదారులపై నిత్యావసర సరుకులను తీసుకువెళ్లే లారీలకు ఎలాంటి అంతరాయం కలుగ‌కుండా 24 గంటలు పనిచేసేలా హెల్ప్‌లైన్ నెంబ‌ర్‌ను ప్రారంభించింది.

ఎలాంటి పాస్‌లు లేకున్నా లారీ డ్రైవర్లను పోలీసులు, రవాణ శాఖ అధికారులు అడ్డుకోవ‌ద్ద‌ని రవాణా శాఖ సూచించింది. సరకులు తీసుకువెళ్లే లారీల‌తోపాటు ఖాళీ లారీలను కూడా ఆపవద్దని ఆదేశించింది. లారీ డ్రైవర్లు, క్లీన‌ర్లు నిత్యావసర సరకుల రవాణా కోసం పలు ప్రాంతాలకు వెళ్లాల్సినందు వల్ల వారిలోనూ క‌రోనా సోకుతుంద‌న్న భ‌యాలు ఉన్నాయ‌ని.. అందుకే వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది మాదిరిగానే  లారీ డ్రైవ‌ర్లు, క్లీన‌ర్లకు కూడా మూడు నెల‌ల కాలానికి ఉచిత ఆరోగ్య బీమా క‌ల్పించాల‌ని నిర్ణ‌యించామ‌ని కేంద్ర ర‌వాణా శాఖ వెల్ల‌డించింది. 


logo