శనివారం 06 జూన్ 2020
National - May 19, 2020 , 19:58:56

వలస కూలీల తరలింపునకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

వలస కూలీల తరలింపునకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: వలస కూలీల తరలింపునకు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. వలస కార్మికుల పంపించడానికి, రిసీవ్‌ చేసుకోవడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నోడల్‌ అధికారులను నియమించి, అవసరమైన అన్న ఏర్పాట్లు చేయాలిన కేంద్రం ఆదేశించింది. తమ రాష్ట్రంలో చిక్కుకున్న వలస కార్మికులను ఇతర రాష్ట్రాలకు పంపించే రాష్ట్రాలు ప్రతి ప్రయాణికుడి వివరాలను ఇచ్చి కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకుంటే సరిపోతుందని, కార్మికుల స్వరాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించాల్సిన అవసరం లేదని సూచించింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా కేవలం ఇరు రాష్ట్రాల సమ్మతితో వలస కార్మికుల తరలింపు జరిగింది. అయితే ఈ విధానంలో కొన్ని రాష్ట్రాలు ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంతో తమ జోక్యం ఉండేలా కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నది. 


logo