గురువారం 04 మార్చి 2021
National - Jan 22, 2021 , 07:14:29

సబ్సిడీ ఎరు‌వు‌లపై కేంద్రం పరిమితులు.. ఇకపై నెలకు 50 బస్తాలే

సబ్సిడీ ఎరు‌వు‌లపై కేంద్రం పరిమితులు.. ఇకపై నెలకు 50 బస్తాలే

హైద‌రా‌బాద్‌: ఇకపై రైతులు ఎన్నంటే అన్ని యూరియా బస్తాలు కొనే అవకాశంలేదు. ఎందుకంటే సబ్సిడీ ఎరు‌వు‌లపై పరిమితులు విధిస్తూ కేంద్ర ఎరువుల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఒక్క రైతు నెలకు ఎంత యూరియా కొనా‌లనే దానిపై పరి‌మితులు అమల్లోకి రానున్నాయి. ‘నె‌లలో ఒక రైతు 50 బస్తాల వరకు సబ్సిడీ ఎరు‌వులు తీసు‌కో‌వాలి. అది ఒక్కసారి కాకుండా నెలలో ఎప్పు‌డైనా అవ‌స‌రాల మేరకు తీసు‌కో‌వచ్చు. 50 బస్తాల కంటే ఎక్కువ తీసు‌కు‌నేం‌దుకు వీలు‌లేదు. ప్లాంటే‌ష‌న్‌కు నెలకు 200 బస్తాల వరకు పరి‌మితి ఉన్నది. ఈ ఉత్తర్వులు వెంటనే అమ‌ల్లోకి వస్తాయి’ అని స్పష్టం‌చే‌సింది. డీబీటీ విధా‌నంలో పీవో‌ఎస్‌ మిషన్ల ద్వారా అమ్మకాలు జరిపే విష‌యంలో ఈ మేరకు చర్యలు తీసు‌కో‌వా‌లని పేర్కొ‌న్నది. ప్రస్తుతం ఒక రైతు ఒకే‌సారి వంద‌సం‌చుల వరకు సబ్సిడీ యూరియా కొనేం‌దుకు పరి‌మితి ఉన్నది. ఇలా ఎన్ని సార్లయినా వంద‌వ‌రకు కొను‌గోలు చేసు‌కో‌వచ్చు.

సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తామని కేంద్రప్రభుత్వం గత బడ్జెట్‌లో స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఎరువుల సబ్సిడీ నిధుల్లో భారీగా కోత విధించింది. బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకి రూ.71,345 కోట్ల అంచనాలను చూపింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఈ మొత్తం రూ.80,035 కోట్లుగా ఉన్నది. ఈ లెక్కన రూ.8,690 కోట్లు తగ్గింది.

VIDEOS

logo