సోమవారం 23 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 14:41:05

కేంద్రం ఢిల్లీకి త‌ప్ప అంద‌రికీ ఇస్తుంది: కేజ్రివాల్

కేంద్రం ఢిల్లీకి త‌ప్ప అంద‌రికీ ఇస్తుంది: కేజ్రివాల్

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం ఢిల్లీపై వివ‌క్ష చూపుతున్న‌ద‌ని అక్క‌డి ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ విమ‌ర్శించారు. దేశంలోని అన్ని మున్సిపాలిటీల‌కు నిధులు మంజూరు చేస్తున్న‌ కేంద్రం.. ఢిల్లీ మున్సిపాలిటీకి మాత్రం మొండిచేయి చూపుతున్న‌దని ఆయ‌న ఆరోపించారు. కేంద్ర స‌ర్కారు ఢిల్లీ మున్సిపాలిటీకి 10 ఏండ్ల కాలానికి రూ.12 వేల కోట్లు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని కేజ్రివాల్ చెప్పారు. ఢిల్లీలోని ప‌లువురు మున్సిప‌ల్ డాక్ట‌ర్లకు కొన్ని నెల‌లుగా వేత‌నాలు చెల్లించ‌డం లేద‌ని, దాంతో వారు రోడ్ల మీద‌కు వ‌చ్చి జీతాల కోసం ధ‌ర్నా చేయాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌ని పేర్కొన్నారు. ఇది మ‌నం సిగ్గుప‌డాల్సిన విష‌యం అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మున్సిప‌ల్ ఉద్యోగులకు వేత‌నాలు చెల్లించ‌లేనంత క‌రువు ఏమొచ్చింద‌ని కేజ్రివాల్ ప్ర‌శ్నించారు.     ‌   ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.