గురువారం 16 జూలై 2020
National - Jun 19, 2020 , 14:18:49

అఖిల‌ప‌క్ష భేటీకి ఆల‌స్యంగా నిర్ణ‌యం: కాంగ్రెస్

అఖిల‌ప‌క్ష భేటీకి ఆల‌స్యంగా నిర్ణ‌యం: కాంగ్రెస్

న్యూఢిల్లీ: అఖిప‌క్ష భేటీ ఏర్పాటు చేసి భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో ఏం జ‌రుగుతుందో చెప్పాల‌ని కాంగ్రెస్ పార్టీ గ‌త కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నా ప‌ట్టించుకోని కేంద్రం ఇప్పుడు ఆల‌స్యంగా నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు అఖిలేష్ ప్ర‌సాద్ విమ‌ర్శించారు. అఖిల‌ప‌క్ష భేటీ నిర్వ‌హించాల‌ని కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దే అయినా, ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

స‌రిహ‌ద్దుల్లో ఏం జ‌రుగుతుందో తెలుసుకునే హ‌క్కు కేవ‌లం ప్ర‌ధానికి, బీజేపీకీ మాత్ర‌మే ఉండ‌ద‌ని, వారితోపాటు అన్ని పార్టీల‌కు స‌మాన హ‌క్కులుంటాయ‌ని అఖిలేష్ ప్ర‌సాద్ హిత‌వుప‌లికారు. మ‌రోవైపు అఖిల‌ప‌క్షానికి అన్ని పార్టీలను ఆహ్వానించ‌క‌పోవ‌డంపై కూడా ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. ఏ ప్ర‌భుత్వ‌మైన అలా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది కాద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికైనా మిగ‌తా పార్టీల‌ను కూడా అఖిల‌ప‌క్షానికి ఆహ్వానించాల‌ని ఆయ‌న‌ సూచించారు.           ‌


logo