ఆదివారం 05 జూలై 2020
National - Jun 29, 2020 , 22:20:40

అన్‌లాక్‌2.0 విధివిధానాలు ఇవే..

అన్‌లాక్‌2.0 విధివిధానాలు ఇవే..

న్యూఢిల్లీ : దేశంలో అన్‌లాక్‌ 2.0 విధివిధాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో జూలై 31వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర శిక్షణ సంస్థలకు జూలై 15 నుంచి కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. హోంమంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులకు అనుమతి ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ విధించారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు జూలై 31వరకు మూసివేయాలని సూచించింది. మెట్రోరైళ్లు, సినిమా హాళ్లు, జిమ్స్‌, సిమ్మింగ్‌ ఫూల్స్‌, పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలపై నిషేధం కొనసాగుస్తున్నట్లు పేర్కొంది.


logo