గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 21:00:09

హ‌రిత‌ ఇంధనాలను ప్రోత్సహిం చేందుకు మ‌రో ముంద‌డుగు వేసిన కేంద్రం

 హ‌రిత‌ ఇంధనాలను ప్రోత్సహిం చేందుకు మ‌రో ముంద‌డుగు వేసిన కేంద్రం

ఢిల్లీ : హ‌రిత‌ ఇంధనాలను ప్రోత్సహిం చేందుకు కేంద్ర సర్కారు మ‌రో ముంద‌డుగు వే సింది. హైడ్రోజన్ సీఎన్‌జీని ఆటోమోటివ్ ఇంధనంగా చేర్చేందుకు గాను జీఎస్ఆర్ 461 (ఈ) ద్వారా సెంట్రల్ మోటారు వాహనాల నిబంధన 1979కు సవరణ కోసం ప్రజల తోపాటు అన్ని భాగ‌స్వామ్యప‌క్షాల నుంచి త‌గిన సలహాలను కోరుతూ రోడ్డు రవాణా  రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌టీహెచ్‌) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. హ‌రిత‌ ఇంధనాలను ప్రోత్సహించే విషయంలో సూచనలు లేదా వ్యాఖ్యలను ప్ర‌భుత్వం ఆహ్వానించింది. జాయింట్ సెక్రటరీ (ఎంవీఎల్), రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ, రవాణా భవన్, పార్లమెంట్ స్ట్రీట్,  న్యూఢిల్లీ -110001 (ఈమెయిల్: [email protected]) నోటిఫికేష‌న్ విడుద‌లైన ముప్పై రోజులలోపు తమ సలహాలను పంపాల్సి ఉంటుంది.


logo