శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 21:02:04

అవ్ర లేబొరేటరీస్ కు కేంద్రీయ ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్

అవ్ర లేబొరేటరీస్ కు కేంద్రీయ ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : ఫవిపిరవిర్ ఎపిఐ ని ఉత్పత్తి చేసి, మార్కెట్ చేసేందుకు హైదరాబాద్‪కు చెందిన అవ్ర లేబొరేటరీస్ ప్రై. లి. అనుమతి పొందింది.  అందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణా సంస్థ (సిడిఎస్‪సిఒ) నుంచి అప్రువల్ మంజూరైంది. కరోనా రోగులకు ఈ మందు ఉపయోగపడనుంది.  ‬అవ్ర లాబొరేటరీస్ ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో, అత్యంత సమర్థవంతంగా ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధిచే సింది. సిప్లా  ఇప్పుడు ఫవిపిరవిర్ తాలూకు జెనెరిక్ రూపాంతరమైన సిప్లెంజా ని ప్రవేశపెట్టడానికి వాణిజ్యపరమైన మొత్తాల్లో దాన్ని సరఫరా చే స్తున్నది.

అవ్ర లేబొరేటరీస్ ఛైర్మన్ డా. ఎ.వి.రామా రావు మాట్లాడుతూ, “సిప్లా, డా.యూసుఫ్ హెమీడగైన్ లతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉన్నదని, వారితో నాకు ఐదు దశాబ్ధాల  అనుబంధం వుంది, ఈ కాలంలో, యాంటీ-కేన్సర్, యాంటీ హెచ్ఐవి/ఎయిడ్స్ వంటి  మందులు, ఇతర జెనెరిక్ మందులను తయారు చేసే పలు ప్రాజెక్టుల్లో కలిసి పనిచే శాము. ఫవిపిరవిర్ ని వేగంగా ప్రవేశపెట్టడానికి అవిశ్రాంతంగా పనిచేస్తామని ” అన్నారు.logo