మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 09:45:28

బ్లాక్‌మార్కెట్‌లో రెమ్‌డిసివిర్‌.. డీజీసీఐ వార్నింగ్‌

బ్లాక్‌మార్కెట్‌లో రెమ్‌డిసివిర్‌.. డీజీసీఐ వార్నింగ్‌

హైద‌రాబాద్‌: కోవిడ్‌19 చికిత్స కోసం రెమ్‌డిసివిర్ మందును వాడ‌వ‌చ్చు అని ప్ర‌భుత్వం చెప్పిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ యాంటీ వైర‌ల్ డ్ర‌గ్‌కు డిమాండ్ పెరిగింది. ఢిల్లీతో స‌హా ప‌లు రాష్ట్రాల్లో ఆ ఇంజెక్ష‌న్‌ మందు కోసం భారీ స్థాయిలో బ్లాక్‌మార్కెట్ జ‌రుగుతున్న‌ది.  ఈ నేప‌థ్యంలో డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ).. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ఆదేశాలు జారీ చేసింది.  ఎంఆర్‌పీ క‌న్నా ఎక్కువ రేటుకు రెమ్‌డిసివిర్ మందును అమ్మ‌కుండా చూడాల‌ని డీజీసీఐ ఆదేశించింది. కొంద‌రు ఆ డ్ర‌గ్‌ను బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధ‌ర‌కు అమ్ముతున్నార‌ని డీజీసీఐ పేర్కొన్న‌ది.  యూపీ నుంచి త‌మ‌కు ఈ అంశంపై ఫిర్యాదులు అందిన‌ట్లు డీజీసీఐ చీఫ్ డాక్ట‌ర్ వీజీ సోమ‌ని తెలిపారు. 

రెమ్‌డిసివిర్‌కు చెందిన జ‌న‌రిక్ మందు‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ట్లు మిలాన్ ఎన్‌వీ డ్ర‌గ్ సంస్థ పేర్కొన్న‌ది.  డేస్రెమ్ పేరుతో జ‌న‌రిక్ వ‌ర్ష‌న్ రిలీజ్‌కు డీజీసీఐ అంగీక‌రించింది. సిప్లా ల్యాబ్స్‌, హెలిరో లిమిటెడ్‌కు చెందిన జ‌న‌రిక్ వ‌ర్ష‌న్‌కు కూడా డీజీసీఐ అనుమ‌తి ద‌క్కింది.  సిప్రెమి పేరుతో సిప్లా త‌మ 100 మిల్లీగ్రాముల మందును రూ.5వేల‌కు అమ్మ‌నున్న‌ది.  కోవిఫ‌ర్‌ను హెటిరో సంస్థ రూ.5400కు అమ్మ‌నున్న‌ది.

 


logo