గురువారం 04 జూన్ 2020
National - May 10, 2020 , 14:54:37

సీఎస్‌, హెల్త్‌ సెక్రటరీలతో కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి భేటీ

సీఎస్‌, హెల్త్‌ సెక్రటరీలతో కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి భేటీ

ఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతాలు, అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్యశాఖ కార్యదర్శులతో కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌ మినహాయింపులు, కంటైన్‌మెంట్‌ జోన్లలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడంపై రాష్ర్టాల సహకారాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అదేవిధంగా వలస కూలీల తరలింపునకు 350 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. రైల్వేశాఖ మొత్తం 3.5 లక్షల వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. మరిన్ని శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రాష్ర్టాలు సహకరించాల్సిందిగా ఆయన కోరారు.


logo