శనివారం 30 మే 2020
National - May 13, 2020 , 19:38:32

వచ్చే నెల నుంచి మిలిటరీ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులు

వచ్చే నెల నుంచి మిలిటరీ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులు

న్యూఢిల్లీ: జూన్‌ ఒకటో తేదీ నుంచి పారా మిలిటరీ క్యాంటీన్లలో స్వదేశీ  ఉత్పత్తులను మాత్రమే విక్రయించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. దేశంలో తయారైన ఉత్పత్తును గరిష్ఠంగా  ఉపయోగించుకోవాలని, ఇతరులను కూడా ఇలాగే చేయాలని ప్రోత్సహించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశారు. వచ్చేనెల ఒకటి నుంచి సీఏపీఎఫ్‌ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులు మాత్రమే విక్రయించడం ద్వారా మిలటరీకి చెందిన 50 లక్షల కుటుంబసభ్యులు ఉపయోగిస్తారని తెలిపారు. ప్రతి భారతీయ పౌరుడు మన దేశంలోనే తయారుచేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసేలా నిర్ణయించుకొంటే వచ్చే ఐదేండ్లలో దేశం స్వయం సమృద్ధి సాధిస్తున్నదన్న నమ్మకమున్నదని పేర్కొన్నారు.


logo