శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 27, 2020 , 16:21:11

కందుల కొనుగోలుకు అనుమతివ్వాలి: మంత్రి సింగిరెడ్డి

కందుల కొనుగోలుకు అనుమతివ్వాలి: మంత్రి సింగిరెడ్డి

ఢిల్లీ : కందుల కొనుగోలుకు కేంద్రం అనుమతివ్వాల్సిందిగా కోరినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 91వ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ICAR) గవర్నింగ్‌ బాడీ సమావేశానికి మంత్రి నేడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వివరాలను వెల్లడిస్తూ... కొత్త కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లోనూ కేవీకేలను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఎన్జీవోలు నిర్వహిస్తున్న కేవీకేల బాధ్యతలు యూనివర్సిటీలకు అప్పగించాలన్నారు. కేంద్రం కందులకు మద్దతు ధర రూ.5,800 నిర్ణయించింది. మద్దతు ధరతో కొనుగోలుకు కేంద్రం 47,500 మెట్రిక్‌ టన్నులకు అనుమతి ఇచ్చింది. ఇవాళ మరో 4,500 మెట్రిక్‌ టన్నులకు అనుమతి తెలిపారు. కాగా ఇంకా 50 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు అనుమతివ్వాలని కోరినట్లు మంత్రి పేర్కొన్నారు.


logo