గోపిచంద్, తమన్నా ప్రధాన పాత్రలలో సంపత్ నంది తెరకెక్కిస్తున్న చిత్రం సీటీమార్. ఏప్రిల్ 2న విడుదల కావలసిన ఈ చిత్రం తాత్కాలిక వాయిదా పడింది. మరికొద్ది రోజులలో మూవీ అఫీషిల్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు. చిత్ర వాయిదాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
సీటీమార్ చిత్రాన్ని సంపత్ నంది మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. గౌతమ్ నందా’ తర్వాత గోపీచంద్, సంపత్ నంది కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్‌లో పాత్రలో నటించాడు. గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా.. తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది. మరో హీరోయిన్గా దిగాంగన నటిస్తోంది. భూమిక మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది.