శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 16:54:45

రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు

రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు

హైదరాబాద్‌ : నిత్యావసర వస్తువుల రవాణాకు సంబంధించి అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. అన్ని రాష్ర్టాల సీఎస్‌లు, డీజీపీలకు హోంమంత్రిత్వశాఖ నేడు పలు ముఖ్యమైన సూచనలు చేసింది. ప్రజలకు అవసరమైన వస్తువుల సరఫరాకు సంబంధించి హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసుకోవాలంది. ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదు చేసే అంశాన్ని ప్రజలకు తెలపాలన్నారు. అధికారులు, పోలీసుల సమన్వయానికి నోడల్‌ అధికారిని నియమించాలని పేర్కొంది. క్యూ లైన్లలో ప్రజలు మీటర్‌ దూరం ఉండేలా చూసుకోవాలని సూచించింది. 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు లాక్‌ చేయొద్దు...

రాష్ర్టాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను లాక్‌ చేయవద్దని అన్ని రాష్ర్టాలకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాల కార్యదర్శులకు డీసీఐఐటీ కార్యదర్శి గురుప్రసాద్‌ లేఖ రాశారు. ఆహార సరఫరాకు ఈ యూనిట్లు నడవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. పంపిణీ, అమ్మకాలు, డెలివరీతో సంబందం ఉన్న వ్యక్తులను కూడా ఆపవద్దని ఆయన పేర్కొన్నారు. కిరాణా, ఔషదాలు, నగదు పంపిణీ సంస్థల ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. ఆహార ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం అంతరాష్ట్ర సరఫరాకు ఎలాంటి పరిమితి ఉండదని పేర్కొన్నారు.


logo