నడ్డాపై దాడి టైంలోఉన్న పోలీసుకు దీదీ ప్రమోషన్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో అధికార టీఎంసీ, బీజేపీల మధ్య రాజకీయం జోరుగా సాగుతున్నది. త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో ఆధిపత్యం చూపి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుండగా.. వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని టీఎంసీ బెట్టుతో ఉన్నది. దాంతో రెండు పార్టీల మధ్య రాజకీయం రసపట్టుగా మారింది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా కాన్వాయ్‌పై డిసెంబర్ 10 న కొందరు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో భద్రతకు బాధ్యత వహించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రావాలని ఆదేశించింది. అయితే, మమతా బెనర్జీ ఈ ఉత్తర్వును ఏమాత్రం ఖాతరు చేయడం లేనట్లుగా కనిపిస్తున్నది. కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసి డిప్యుటేషన్‌పై ఐటీబీపీకి పంపగా.. మమతా దీదీ మాత్రం ఆయనను వెంటేసుకు వస్తున్నది. కేంద్రం ఆదేశాలతో డిప్యుటేషన్‌కు పంపించకపోవడమే కాకుండా ఆయనకు పదోన్నతి కల్పించి మరోసారి కేంద్రంతో అమితుమికి సిద్ధమైంది.
రాజీవ్ మిశ్రా దక్షిణ బెంగాల్ పోలీస్ జోన్లో ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) గా ఉన్నారు. అతడికి మమత బెనర్జీ ప్రభుత్వం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) గా పదోన్నతి కల్పించింది. డైమండ్ హార్బర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ భోలనాథ్ పాండేను ఎస్పీ హోంగార్డ్ పదవికి బదిలీ చేశారు. అదే సమయంలో, మరో ఐపీఎస్ అధికారి డీఐజీ ప్రవీణ్ కుమార్ త్రిపాఠికి ఇప్పటివరకు ఉన్న స్థానంలోనే ఉంచారు. జేపీ నడ్డా పర్యటన సమయంలో రాజీవ్ మిశ్రాతో పాటు, పాండే, త్రిపాఠి ఇద్దరు కూడా భద్రతా ఏర్పాట్లలో మోహరించారు. జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ళు రువ్విన ఘటన అనంతరం.. ఈ ముగ్గురు అధికారులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డిసెంబర్ 16 న డిప్యుటేషన్‌పై పిలిచింది. వీరిలో రాజీవ్ మిశ్రాను ఐటీబీపీకి, భోలనాథ్ పాండేను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్ డీ), ప్రవీణ్ కుమార్ త్రిపాఠిని ఎస్ఎస్బీకి కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీటిని పట్టించుకున్న దాఖలా లేదు. ఇది ముమ్మాటికి "రెచ్చగొట్టే దశ" గా బీజేపీ నాయకుడు షహనావాజ్ హుస్సేన్ అభివర్ణించారు. నడ్డా కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన సమయంలో భద్రతా చర్యలను చూసిన అధికారికి పదోన్నతి కల్పించడాన్ని.. దాడి చేసిన వారికి ప్రతిఫలం లభిస్తుందనడానికి ఇది సంకేతమని విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి
- కథ డిమాండ్ చేస్తే గ్లామర్ షోకు రెడీ అంటున్న ప్రియమణి