శనివారం 16 జనవరి 2021
National - Dec 23, 2020 , 09:22:40

కరోనా టీకా నిల్వకు కేంద్రం ఏర్పాట్లు

కరోనా టీకా నిల్వకు కేంద్రం ఏర్పాట్లు

న్యూఢిల్లీ : కరోనా టీకా నిల్వలకు కేంద్రం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కోల్డ్‌స్టోరేజ్‌ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. 120 వాట్స్‌ సామర్థ్యం కలిగిన 90 డీప్‌ ఫ్రీజర్లు నెలకొల్పేలా భవన నిర్మాణం చేపట్టింది. కోల్డ్‌స్టోరేజ్‌లో మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మిస్తుంది. అలాగే ఏడు గదులు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 25వ తేదీ వరకు శీతల గిడ్డంగిని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వచ్చే జనవరిలో కరోనా మహమ్మారి కోసం టీకా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సైతం టీకా పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌’, సీరం ఇనిస్టిట్యూట్‌ ‘కొవిషీల్డ్‌’, అమెరికాకు చెందిన ఫైజర్‌ కంపెనీ దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌కు దరఖాస్తులు సమర్పించాయి. ఈ క్రమంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌కు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే కేంద్రం టీకా పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీకాలను నిల్వ చేసేందుకు అవసరమైన కోల్డ్‌స్టోరేజ్‌ను ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి..

బోరిస్‌ జాన్సన్‌ ఇండియా టూర్‌ అనుమానమే!
బెంగాల్‌లో తెలుగుకు అధికార భాషా హోదా
బైడెన్‌ టీంలో మరో ఇద్దరు భారతీయులు