మంగళవారం 14 జూలై 2020
National - Jun 14, 2020 , 22:25:23

పశుపతినాథ్‌ ఆలయంలో ‘సెన్సార్‌ బెల్‌'

పశుపతినాథ్‌ ఆలయంలో ‘సెన్సార్‌ బెల్‌'

భోపాల్‌‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన ఆంక్షల సడలింపు తర్వాత దేశవ్యాప్తంగా ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి. ప్రార్థనా స్థలాలకు వచ్చే భక్తులకు వైరస్‌ సోకకుండా ఆయా ఆలయాల నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కోరకమైన చర్యలు తీసుకొంటుండగా.. మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ అష్టముఖి పశుపతినాథ్‌ మహదేవ్‌ ఆలయంలో ప్రత్యేకంగా ‘సెన్సార్‌ బెల్‌'ను ఏర్పాటుచేశారు. 

ఆలయానికి వచ్చే భక్తులు ముట్టుకోవాల్సిన అవసరం లేకుండానే గంట మోగేలా సెన్సార్‌ గంటను ఏర్పాటుచేశారు. భక్తులు గంట కిందకు చేరుకోగానే లేదా దాని కింద చేతులు పెట్టగానే అది మోగుతుంది. ముస్లిం మతస్థుడైన నెహ్రూ ఖాన్‌ మేవ్‌ అనే 62 ఏండ్ల వృద్ధుడు దీన్ని తయారుచేయడం విశేషం. ఈ గంట తయారీకి రూ.ఆరు వేలు ఖర్చయిందని, ఆలయానికి దీన్ని బహుమానంగా ఇచ్చినట్లు ఆయన చెప్తున్నారు. 


logo