మంగళవారం 19 జనవరి 2021
National - Dec 21, 2020 , 03:00:19

శునకాలకు శ్మశానవాటిక

శునకాలకు శ్మశానవాటిక

న్యూఢిల్లీ: విశ్వాసానికి మారుపేరుగా భావించే శునకాల కోసం దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌డీఎంసీ) అధికారులు తొలిసారిగా శ్మశానవాటికను సిద్ధం చేశారు. నగరంలోని ద్వారక ప్రాంతంలో 700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మరణించిన శునకాలకు పురోహితులతో అంతిమ సంస్కారాలు జరుపుతామని, చితా భస్మాన్ని 15 రోజులపాటు నిల్వ ఉంచుతామని వెల్లడించారు.