బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 08, 2020 , 10:55:57

కమలా పూర్వీకుల గ్రామంలో సంబురాలు

కమలా పూర్వీకుల గ్రామంలో సంబురాలు

చెన్నై : అమెరికా ఉపాధ్యక్షురాలిగా డెమొక్రాట్‌ అభ్యర్థి కమలా హారిస్‌ గెలుపొందడంపై తమిళనాడులోని తిరువరూర్‌ జిల్లాలోని తులసేంద్రపురంలో గ్రామస్తులు సంబురాలు జరుపుకున్నారు. గ్రామస్తులు ప్రత్యేకంగా రంగోళీలతో అలంకరించారు. ‘వనక్కం అమెరికా’, మా గ్రామానికి గర్వకారణం హారిస్‌.. అభినందనలు’ అంటూ రంగోళీలు తీర్చిదిద్దారు. వీటికి తోడు తులసేంద్రపురంలో స్థానికులు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు బాణాసంచ కాల్చారు. అనంతరం స్వీట్లు పంచారు. కమలా తండ్రి డొనాల్డ్‌ జే హ్యారిస్‌ జమైకాకు చెందినవారు. తల్లి శ్యామలా గోపాలన్‌ ప్రముఖ క్యాన్సర్‌ పరిశోధకురాలు. కమలా తల్లి చెన్నై నగరానికి దక్షిణాన 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న తులసేంతిరాపురానికి చెందిన వారు.


కమలా 1964, అక్టోబర్‌ 20న కమల కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించారు. హోవర్డ్‌ యూనివర్సిటీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో కమల న్యాయవిద్యను అభ్యసించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలువగా.. ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను ఎన్నుకున్నారు. బైడెన్‌ విజయవంతో అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళ, తొలి నల్లజాతి అమెరికన్‌, తొలి ఇండో-అమెరికన్‌, తొలి ఆసియా-అమెరికన్‌ మహిళగా కమలా రికార్డు సృష్టించనున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.