సోమవారం 26 అక్టోబర్ 2020
National - Aug 20, 2020 , 16:32:45

మొహర్రం సాదాసీదాగా జరుపుకోండి : మహా ప్రభుత్వం

మొహర్రం సాదాసీదాగా జరుపుకోండి : మహా ప్రభుత్వం

ముంబై : కరోనా సంక్షోభం నేపథ్యంలో మొహర్రంను సాదాసీదాగా, ఇండ్లలోనే జరుపుకోవాలని, ఊరేగింపులకు అనుమతి లేదని మహారాష్ర్ట ప్రభుత్వం బుధవారం సర్క్యులర్‌ జారీ చేసింది. 

ఏడో శతాబ్దంలో కర్బాలా యుద్ధంలో హజ్రత్ ఇమామ్ హుస్సేన్ యొక్క బలిదానానికి ప్రతీకగా ముస్లింలు మొహర్రం పండుగను జరుపుకుంటారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో ఇది ఒక పవిత్ర నెల. కరోనాను ఎదుర్కోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, మతపరమైన కార్యక్రమాలపై విధించిన నిషేధంలో భాగంగా ఈ ఏడాది మొహర్రం పండుగ సందర్భంగా ‘మాతం’ ఊరేగింపులను అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లింలు తమ ఇళ్లలోనే మత పరమైన కార్యక్రమాలు చేపట్టాలని సర్క్యులర్‌లో తెలిపింది. 

సామాజిక, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలను ఆన్‌లైన్‌లో నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. తాజియా (ఇమామ్ హుస్సేన్ సమాధికి ప్రతిరూపం)ను బయటకు తీయడానికి అనుమతి లేదని కూడా తెలిపింది. స్టాల్స్‌ ఏర్పాటుకు స్థానిక పరిపాలన నుంచి అనుమతి తీసుకోవాలని, ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మంది అక్కడ ఉండరాదని ప్రభుత్వం తెలిపింది. ఏ కార్యక్రమంలోనైనా నలుగురికి మించి అనుమతించబడదని ప్రభుత్వం తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo