శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 10:42:20

ఎన్‌95 మాస్కులను విడుదల చేసిన సియట్‌ టైర్స్‌

ఎన్‌95 మాస్కులను విడుదల చేసిన సియట్‌ టైర్స్‌

ముంబై : ప్రముఖ టైర్ల కంపెనీ అయిన సియట్‌ కొత్తగా ఎన్‌95 మాస్కులను విడుదల చేసింది, చాలా వరకు ఆటోపరిశ్రమలు వెంటిలేటర్లు, పీపీఈ కెట్లు వంటి పరికరాలను తయారు చేస్తున్నాయి. తాజాగా వాటిల్లో సియట్‌ కూడా చేరింది. ఎన్‌95 మాస్కులను నేడు మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మాస్కుకు గోసేఫ్‌ ఎన్‌95 మాస్క్‌ అని పేరుపెట్టింది. దీని లోపలి భాగాన్ని యాంటీబ్యాక్టీరియల్‌ వస్ర్తంతో తయారు చేశారు. దీని ధర రూ.249గా నిర్ణయించారు. సియట్‌ కంపెనీకు చెందిన దుకాణాల్లో ఈ మాస్కులు అందుబాటులో ఉంటాయి.

మాస్కు విడుదల సందర్భంగా సియట్‌ టైర్స్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌ టొలానీ మాట్లాడుతూ సేఫ్టీ ఫస్ట్‌ అనే సిద్ధాంతానికి అనుగుణంగా మేము ఈ మాస్కును తయారు చేశామని తెలిపారు. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించేందుక మా వంతు సాయంగా దీనిని అందుబాటులోకి తెచ్చామన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo