గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 09:33:15

పాక్‌ కాల్పుల్లో ఓ పౌరుని మృతి, ఇద్దరికి గాయాలు

పాక్‌ కాల్పుల్లో ఓ పౌరుని మృతి, ఇద్దరికి గాయాలు

పూంచ్‌: సరిహద్దుల్లో పాకిస్థాన్‌ తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నది. జమ్ముకశ్మీర్‌ పూంచ్‌ జిల్లాలోని బాలాకోట్‌ సెక్టార్‌లో ఈ రోజు తెల్లవారుజామున పాక్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందగా, మరొ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వాస్తవాధీన రేఖ వెంబడి బుధవారం ఉదయం రెండు గంటలకు పాక్‌ సైనికులు కాల్పులు ప్రారంభించారు. సుమారు 45 నిమిషాలపాటు కాల్పులు కొనసాగాయని, 2 గంటల 45 నిమిషాలకు కాల్పులు ఆగిపోయాయని అధికారులు ప్రకటించారు. 

లడఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. దీన్ని అదనుగా తీసుకున్న పాకిస్థాన్‌ ఆర్మి సరిహద్దుల వెంబడి భారత్‌పై మరింత ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత భూభాగంపై ప్రతిరోజు కాల్పులు జరుపుతున్నది. జూన్‌ నెలలో 411 సార్లు ఒప్పందాన్ని అతిక్రమించింది. మే నెలలో ఇలాంటి సంఘనలు 382 చోటు చేసుకున్నాయి. ఏప్రిల్‌, మార్చి నెలల్లో 387, 411 సార్లు కాల్పులకు పాల్పడింది. 


logo