శుక్రవారం 05 జూన్ 2020
National - May 24, 2020 , 11:47:45

పీఎం కేర్స్‌ నిధికి ఏడాది పాటు ప్రతి నెల 50 వేలు : బిపిన్‌ రావత్‌

పీఎం కేర్స్‌ నిధికి ఏడాది పాటు ప్రతి నెల 50 వేలు : బిపిన్‌ రావత్‌

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై పోరాటం కోసం నిధుల సేకరణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. పీఎం కేర్స్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీఎం కేర్స్‌ నిధికి విరాళాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. పలువురు ప్రముఖులు విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కూడా పీఎం కేర్స్‌ నిధికి విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వచ్చే 12 నెలల వరకు పీఎం కేర్స్‌ నిధికి నెలకు రూ. 50 వేల చొప్పున విరాళం ఇస్తున్నట్లు బిపిన్‌ రావత్‌ ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత వర్గాలకు బిపిన్‌ రావత్‌ లేఖ రాశారు. రావత్‌ ఏప్రిల్‌ నెల జీతంలో రూ. 50 వేలను పీఎం కేర్స్‌ ఫండ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. సీడీఎస్‌ సిబ్బంది మొత్తం కలిసి ఒక రోజు జీతాన్ని పీఎం కేర్స్‌ నిధికి అందజేసిన విషయం తెలిసిందే.  logo