విచారణ గది, లాకప్‌లో సీసీటీవీలు, ఆడియో రికార్డింగ్ తప్పని సరి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ, ఎన్సీబీ, రెవెన్యూ ఇంటెలిజెన్స్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లోనూ సీసీటీవీలు, ఆడియో రికార్డింగ్ వ్యవస్థలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఆయా సంస్థల విచారణ గదులు, లాకప్ రూమ్స్, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, కారిడార్లు, లాబీలు, రిసెస్షన్ ఏరియా, వాష్‌రూమ్ బయట వీటిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. వీడియో, ఆడియో రికార్డింగులను ఆధారాల కోసం 18 నెలలపాటు భద్రపరచాలని తెలిపింది. సీసీటీవీలు, ఆడియో రికార్డింగ్ వ్వవస్థల ఏర్పాటు కార్యాచరణపై రాష్ట్రాలు ఆరు వారాల్లో కోర్టుకు నివేదించాలని పేర్కొంది.
లాకప్ డెత్స్‌ను నివారించే క్రమంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తి జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు బుధవారం తెలిపింది. పంజాబ్‌లో కస్టడీ డెత్‌పై విచారణ సందర్భంగా సీసీటీవీ కెమేరాల ఏర్పాటుపై 2018లో జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై రాష్ట్రాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీసీటీవీల ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని, కస్టడీ టార్చర్ ఫిర్యాదులపై విచారణకు ప్రతి జిల్లాలో మానవ హక్కుల కోర్టులను ఏర్పాటు చేయాలని తెలిపింది. తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- వుహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో బృందం.. ముగిసిన క్వారెంటైన్
- మైనర్ ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడి కాదు: బాంబే హైకోర్టు
- పీఎన్బీలో సెక్యూరిటీ మేనేజర్ పోస్టులు
- వివాహితకు వేధింపులు.. యువకుడు అరెస్ట్
- బీజేపీ వెబ్సైట్ : ఎంపీని హోమోసెక్సువల్‌గా చిత్రించారు
- కొడుకు 10 కోట్లు డిమాండ్.. అసభ్యకర చిత్రాలతో బెదిరింపులు
- అనసూయ మూవీ ట్రైలర్ విడుదల చేయనున్న వెంకీ
- ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ రూరల్ పీఆర్ ఏఈ
- 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం..
- చరిత్రలో ఈరోజు.. కైఫ్ కెప్టెన్సీలో అండర్-19 కప్ అందుకున్న భారత్