శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 17:02:54

కృష్ణ‌ప‌ట్నం పోర్ట్ ఒప్పందానికి సిసిఐ అనుమ‌తి

 కృష్ణ‌ప‌ట్నం పోర్ట్ ఒప్పందానికి సిసిఐ అనుమ‌తి

ఢిల్లీ : కృష్ణ‌పట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ ను అదాని పోర్ట్సు, స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్ లిమిటెడ్‌, స‌మీక‌రించేందుకు కాంపిటిష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సిసిఐ) అనుమ‌తిచ్చింది. ప్ర‌తిపాదిత స‌మీక‌ర‌ణ‌ , ఈక్విటీ షేర్‌హోల్డింగ్‌తోపాటు కృష్ణ‌ప‌ట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (కెపిసిఎల్‌)యాజ‌మాన్య నియంత్ర‌ణ‌ను కూడా అదాని పోర్ట్స్‌, స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్ లిమిటెడ్ ( అదాని పొర్ట్స్‌) పొందేందుకు వీలుక‌ల్పిస్తుంది. అదాని పోర్ట్సు క‌స్ట‌మ‌ర్‌తోనేరుగా సంబంధాలు క‌లిగిన స‌మీకృత పోర్టు మౌలిక‌స‌దుపాయాల సేవ‌లు అందించే సంస్థ . ఇది ప్ర‌స్తుతం గుజ‌రాత్‌, గోవా, కేర‌ళ‌, ఆంద్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, ఒడిషా  రాష్ట్రాల‌లోని ప‌ది పోర్టుల‌లో ఉంది. 

ప్ర‌స్తుతం దీనిని సేక‌రిస్తున్న సంస్థ లాజిస్టిక్స్ చెయిన్‌ ( అంటే వెస‌ల్ మేనేజ్ మెంట్ నుంచి యాంక‌రేజ్‌, పైల‌టేజ్, ట‌గ్ పుల్లింగ్‌, బెర్తింగ్ స‌ర‌కు లోడింగ్ అన్‌లోడింగ్‌, అంత‌ర్గ‌త ర‌వాణా ,నిల్వ , ప్రాప‌సెసింగ్ చివ‌ర‌గా రోడ్డు లేదా రైలు మార్గంలో స‌ర‌కు త‌ర‌లింపు వ‌ర‌కు)ను నిర్వ‌హిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం వద్ద డీప్‌సీ ఓడరేవు  అభివృద్ధి , నిర్వ‌హ‌ణ‌దారు కార్య‌క‌లాపాల‌లో కెపిసిఎల్  నిమగ్నమై ఉంది. ఇది నిర్మించు-నిర్వ‌హించు-భాగ‌స్వామ్యం- బ‌ద‌లీ ప్రాతిప‌దిక‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి 30 సంవ‌త్సరాల కాలానికి రాయితీ ఒప్పందానికి అనుగుణంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌ర్తించనున్నది. ఇది మ‌రో 20ఏండ్లు అంటే రెండు విడ‌త‌లుగా పొడిగింపున‌కు వీలున్నది.


logo